తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న చలి తీవ్రత..

ABN , First Publish Date - 2021-12-19T12:44:05+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో మరింత చలి తీవ్రత పెరగనుంది. ఇప్పటికే రాత్రిళ్లు నెగళ్లు(చలిమంటలు) వేసుకుని ఉపశమనం పొందుతున్నారు

తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న చలి తీవ్రత..

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మరింత చలి తీవ్రత పెరగనుంది. ఇప్పటికే రాత్రిళ్లు నెగళ్లు(చలిమంటలు) వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. ఉత్తరం, ఈశాన్యం నుంచి వీస్తున్న చలి గాలులతో రానున్న 4 రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోనున్నాయి. హైదరాబాద్‌లో కనిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో పలు జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, సిరిసిల్ల, జగిత్యాల, మహబూబాబాద్‌ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది.

Updated Date - 2021-12-19T12:44:05+05:30 IST