వీసీల నియామక ఫైల్‌పై సీఎం సంతకం
ABN , First Publish Date - 2021-05-20T07:23:51+05:30 IST
దాదాపు రెండున్నరేళ్లుగా ఖాళీగా ఉన్న విశ్వవిద్యాలయాల ఉపకులపతుల (వీసీలు) నియామకంపై ఎట్టకేలకు రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది.

- రాజ్‌భవన్‌కు చేరిన దస్త్రం..
- నేడు నిర్ణయం ప్రకటించనున్న గవర్నర్!
హైదరాబాద్, మే 19(ఆంధ్రజ్యోతి): దాదాపు రెండున్నరేళ్లుగా ఖాళీగా ఉన్న విశ్వవిద్యాలయాల ఉపకులపతుల (వీసీలు) నియామకంపై ఎట్టకేలకు రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది. పది వర్సిటీలకు వీసీల నియామకంపై సీఎం కేసీఆర్ బుధవారం సంతకం చేశారు. అనంతరం ఆ ఫైల్‌ను గవర్నర్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపారు. అయితే గవర్నర్ తమిళిసై పుదుచ్చేరిలో ఉన్నారు. టీఎ్‌సపీఎస్సీ పాలకవర్గానికి సంబంధించిన ఫైల్ బుధవారం రాజ్‌భవన్‌కి వచ్చిన వెంటనే గవర్నర్ ఈ-మెయిల్ ద్వారా ఆమోదం తెలిపారు. అలాగే వీసీల జాబితాను కూడా ఈ-మెయి ల్ ద్వారా ఆమోదం తెలుపుతారని భావించగా.. బుధవారం రాత్రి వరకు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.