కొడంగల్‌పై సీఎం వరాల జల్లు

ABN , First Publish Date - 2021-01-12T09:30:54+05:30 IST

కొడంగల్‌ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని అభినందించారు

కొడంగల్‌పై సీఎం వరాల జల్లు

హైదరాబాద్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): కొడంగల్‌ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని అభినందించారు. కొత్తగా దుద్యాల్‌, గుండుమల్‌, కొత్తపల్లి మండలాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సీఎ్‌సను ఆదేశించారు. బొంరా్‌సపేట, దౌలతాబాద్‌ మండలాలల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. కొడంగల్‌కు మంజూరై ఇతర ప్రాంతాల్లో నడుస్తున్న గురుకుల పాఠశాలలన్నీ నియోజకవర్గానికి తరలించాలని సూచించారు. నియోజకవర్గంలో బంజారా భవన్‌ నిర్మాణం చేపడతామని ప్రకటించారు. త్వరలో ఆర్టీసీ డిపో, ఆస్పత్రి ప్రారంభించాలని, కోస్గి డిపోకు నిధులు ఇవ్వాలని, రూ.10 కోట్లతో కోస్గి- సజ్జకాన్‌పేట రహదారి విస్తరణ చేపట్టాలని ఆదేశించారు. 

Updated Date - 2021-01-12T09:30:54+05:30 IST