యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించిన కేసీఆర్

ABN , First Publish Date - 2021-06-22T03:34:37+05:30 IST

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించిన కేసీఆర్

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించిన కేసీఆర్

యాదాద్రి: లక్ష్మీ నరసింహస్వామివారిని సీఎం కేసీఆర్‌ దర్శించుకున్నారు. బాలాలయంలో స్వామివారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సాంప్రదాయాలతో సీఎం కేసీఆర్‌కు అర్చకులు, ఆలయాధికారులు  ప్రత్యేక స్వాగతం పలికారు. బాలాలయం మండపంలో సీఎం కేసీఆర్‌కు వేదాశీర్వచనం అందజేశారు. బెంగుళూర్‌కు చెందిన లైటింగ్ టెక్నాలజీ సంస్థచే ప్రధానాలయానికి ఏర్పాటు చేసిన పసిడి వర్ణపు విద్యుత్ కాంతులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. సీఎం కేసీఆర్ వెంట ఉన్న మంత్రులు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ఉన్నారు. 


Updated Date - 2021-06-22T03:34:37+05:30 IST