వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించిన సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2021-05-21T19:47:27+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలోకి కోవిడ్ వార్డులలో పర్యటించి రోగులను పరామర్శించారు.

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించిన సీఎం కేసీఆర్

వరంగల్: ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలోకి కోవిడ్ వార్డులలో పర్యటించి రోగులను పరామర్శించారు. కరోనా రోగులకు అందుతున్న వైద్యసేవలు, సౌకర్యాలపై సీఎం ఆరా తీశారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ముఖ్య అధికారులు ఉన్నారు. కొవిడ్‌ రోగులకు చికిత్స అందించడంలో ఎంజీఎం ఆస్పత్రి విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తడం, కొవిడ్‌ రోగులకు సరైన వైద్య సహాయం అందడం లేదన్న ఆరోపణలు రావడంతో సూపరింటెండెంట్‌గా నాగార్జునరెడ్డిని తప్పించి వి.చంద్రశేఖర్‌ను నియమించారు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్‌ ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఎంజీఎం నుంచి సీఎం కేసీఆర్ రాజ్యసభ సభ్యుడు, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతారావు ఇంటికి వెళ్లారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-05-21T19:47:27+05:30 IST