వాసాల మర్రిలో సీఎం కేసీఆర్ పర్యటన
ABN , First Publish Date - 2021-08-05T01:49:32+05:30 IST
జిల్లాలోని తుక్కపల్లి మండలంలోని దత్తత గ్రామం వాసాలమర్రిలోని దళిత వాడల్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు బుధవారం సుమారు మూడు గంటల పాటు పర్యటించారు.
యాదాద్రి భువన గిరిజిల్లా: జిల్లాలోని తుక్కపల్లి మండలంలోని దత్తత గ్రామం వాసాలమర్రిలోని దళిత వాడల్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు బుధవారం సుమారు మూడు గంటల పాటు పర్యటించారు. దళిత కుటుంబాల మహిళలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బొట్టుపెట్టి స్వాగతం పలికారు. దళిత వాడల్లోని సుమారు 60 ఇండ్లలోకి వెళ్లి కాలినడకన పర్యటిస్తూ ప్రతి ఒక్కరినీ యోగ క్షేమాలును, కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. మొదట దళిత వావల్లో పర్యటించిన సీఎం ఇండ్లులేని వారందరికీ డబుల్‌బెడ్‌రూం ఇండ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దళిత బంధు పథకం గురించి తెలుసా?అని అడిగి తెలుసుకున్నారు.
ఇంటికి పది లక్షలు వస్తే ఏం చేస్తారు? దళిత బంధు డబ్బులు ఏం చేద్దాం అని అనుకుంటున్నారు? అని సీఎం ప్రశ్నించారు. కొంత మంది మిల్క్ డైరీ ప్లాంటు పెట్టుకుంటామని, కొందరు ట్రాక్టర్‌లు కొంటామని, మరి కొందరు వ్యాపారాలు చేసుకుంటామని సీఎంకు వివరించారు. దళిత వాడల్లో పర్యటిస్తున్న క్రమంలో ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలుకరిస్తూ మీకు పెన్షన్ వస్తున్నదా? అని ఆరా తీశారు. పెన్షన్ రాని వాళ్లు ఎవరైనా ఉంటే వారికి వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని జిల్లాకలెక్టర్ పమేలా సత్పతిని ఆదేశించారు. దళిత వాడల్లో మట్టి గోడల మీద కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లను చేసి సీఎం చలించిపోయారు.
కొన్నిఇండ్లలో ఇంటిలోపలికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధళిత బంధు డబ్బులు వస్తే వాటిని ఉపయగించుకునే మంచి ఆలోచనలు చేయాలని సూచించారు. దళిత కుటుంబాలతో పాటు ఇతర కాలనీల్లో కూడా సీఎం పర్యటించారు. ప్రతి ఒక్కరికీ ఇండ్లు మంజూరుచేస్తామని, దిగులు పడొద్దని వారికి భరోసా ఇచ్చారు. నిరుపేద మహిళలు వ, వృద్దులు చప్పిన సమస్యలను ముఖ్యమంత్రికేసీఆర్ జాగ్రత్తగా విని అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3గంటల వరకూ గ్రామ కాలనీల్లో సుమారు నాలుగు కిలో మీటర్ల వరకు కాలినడకన పర్యటించారు.