తెలంగాణ చరిత్రలో జయశంకర్‌ చిరస్థాయిగా నిలిచిపోతారు- కేసీఆర్‌

ABN , First Publish Date - 2021-06-21T20:24:35+05:30 IST

తెలంగాణ స్వయం పాలనా స్వాప్నికుడు, స్వరాష్ట్రం కోసం సాగిన ఉద్యమాల్లో భావజాల వ్యాప్తికి తన జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ చరిత్రలో చిరకాలం నిలిచిపోతారని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తెలిపారు.

తెలంగాణ చరిత్రలో జయశంకర్‌ చిరస్థాయిగా నిలిచిపోతారు- కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ స్వయం పాలనా స్వాప్నికుడు, స్వరాష్ట్రం కోసం సాగిన ఉద్యమాల్లో భావజాల వ్యాప్తికి తన జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ చరిత్రలో చిరకాలం నిలిచిపోతారని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తెలిపారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా సీఎం ఆయనను స్మరించుకున్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణలో పెడుతున్నదని, ప్రొఫెసర్‌జయశంకర్‌ ఆలోచనలకు నుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలు స్వయం సమృద్ధిని సాధిస్తున్నాయని సీఎం అన్నారు. ఒక్కొక్క రంగాన్ని సరిదిద్దుకుంటూ, దేశంలోని ఇతర రాష్ర్టాలతో అభివృద్ధిలో తెలంగాణ పోటీ పడుతూ, నూతన రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తూ, తద్వారా ప్రొఫెసర్‌ జయశంకర్‌కు ఘన నివాళి అర్పిస్తున్నదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. 

Updated Date - 2021-06-21T20:24:35+05:30 IST