ఈ నెల 7న టీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం

ABN , First Publish Date - 2021-02-05T20:41:24+05:30 IST

సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గం సమావేశం కానుంది. ఈ నెల 7న మద్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో జరగనున్న

ఈ నెల 7న టీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం

హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గం సమావేశం కానుంది. ఈ నెల 7న మద్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో జరగనున్న ఈ సమావేశానికి రాష్ట్ర కమిటి సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, శాసనసభ, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్ పర్సన్లు, జడ్పీ చైర్ పర్సన్లు, మున్సిపల్ మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్ అధ్యక్షులను ఆహ్వానించారు. పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల నియామకం, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ఏప్రిల్ 27న పార్టీ వార్షిక మహాసభ, ఇతర సంస్థాగత అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారు.

Updated Date - 2021-02-05T20:41:24+05:30 IST