ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. పీఆర్సీ ప్రకటన

ABN , First Publish Date - 2021-03-22T18:08:55+05:30 IST

పీఆర్సీపై తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. 30శాతం ఫిట్ మెంట్ ఇస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానున్నట్టు ప్రకటనలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. పీఆర్సీ ప్రకటన

హైదరాబాద్: పీఆర్సీపై తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. 30శాతం ఫిట్ మెంట్ ఇస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానున్నట్టు ప్రకటనలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తాజా పీఆర్సీతో 9,17,797 మంది ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో పలుమార్లు చర్చించానని, కరోనా, ఆర్థికమాంద్యం కారణంగా పీఆర్సీ ఆలస్యం అయ్యిందన్నారు. అలాగే ఉద్యోగుల రిటైర్మెంట్ వయో పరిమితిని 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకి పెంచుతున్నట్టు తెలిపారు. 


ప్రకటన సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని, అన్ని విభాగాల ఉద్యోగుల అందరికీ పీఆర్సీ వర్తిస్తుందన్నారు. మానవీయ కోణంలో వేతనాలు పెంచామని ఆయన అన్నారు. ప్రమోషన్ల తర్వాత ఏర్పడే ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ప్రతి ఐదేళ్ల ప్రకారం పీఆర్సీ పెంచామన్నారు. ఇప్పటి వరకు 80 శాతం ఉద్యోగాల ప్రమోషన్ ప్రక్రియ పూర్తి అయ్యిందన్నారు. వెంటనే అంతర్ జిల్లాల బదిలీలు ఉంటాయని తెలిపారు. పెన్షనర్లు వయోపరిమితిని 75 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు కుదిస్తున్నట్టు ప్రకటనలో తెలిపారు. 


ఇదిలా ఉంటే, సీఎం ప్రకటన పూర్తి చేయగానే పక్కనే ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ... ఆయన దగ్గరకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. పీఆర్సీ ప్రకటనపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.  

Updated Date - 2021-03-22T18:08:55+05:30 IST