కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించిన కేసీఆర్

ABN , First Publish Date - 2021-12-16T01:47:47+05:30 IST

గత కొంత కాలంగా పదవుల కోసం ఎదురు చూసిన నాయకులకు కార్పొరేషన్ పదవులు దక్కాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పలుకార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించారు.

కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించిన కేసీఆర్

హైదరాబాద్: గత కొంత కాలంగా పదవుల కోసం ఎదురు చూసిన నాయకులకు కార్పొరేషన్ పదవులు దక్కాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పలుకార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ గా మన్నెక్రిశాంక్ నియమితులయ్యారు. అలాగే తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ , ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా  డా. ఎర్రోళ్ల శ్రీనివాస్ నియమితులయ్యారు. కాగా తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి వేద సాయిచందర్ నియమితులయ్యారు. 

Updated Date - 2021-12-16T01:47:47+05:30 IST