ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా కేసీఆర్‌ శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2021-03-21T22:43:14+05:30 IST

ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా కేసీఆర్‌ శుభాకాంక్షలు

హైదరాబాద్‌: ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అడవుల పునరుద్దరణ, సంరక్షణకు గడిచిన ఆరేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమం సాధిస్తున్నఘనతను సీఎం గుర్తుచేశారు. పచ్చదనాన్ని అభివృద్ధిచేసే కృషిలో భాగంగా మొక్కలునాటే కార్యక్రమాన్ని చేపట్టి దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని పేర్కొన్నారు. హరితయజ్ఞంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరినీ సీఎం కేసీఆర్‌ అభినందించారు. 

Updated Date - 2021-03-21T22:43:14+05:30 IST