మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశం

ABN , First Publish Date - 2021-02-26T23:49:48+05:30 IST

నగరంలో తనకు అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. సమావేశానికి రాజ్యసభ

మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశం

హైదరాబాద్: నగరంలో తనకు అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. సమావేశానికి రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుతో సహా 8 మంది మంత్రుల హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాలు, ధాన్యం కొనుగోలు, సాగర్‌ ఎన్నికపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే నియోజకవర్గాలకు మంత్రులను ఇంఛార్జ్‌లుగా నియమించే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే 6 జిల్లాల పరిధిలోని నియోజకవర్గాల్లో రేపు టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని సూచించినట్లు తెలిసింది. 

Updated Date - 2021-02-26T23:49:48+05:30 IST