తెలంగాణ తాగునీటి కష్టాలను పారదోలాం: కేసీఆర్

ABN , First Publish Date - 2021-03-22T23:04:37+05:30 IST

ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ తాగునీటి కష్టాలను పారదోలాం: కేసీఆర్

హైదరాబాద్‌: ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నీరు వంటి సహజ వనరులను కాపాడడం ద్వారా ప్రకృతి సమతుల్యాన్ని పరిరక్షించడమే రేపటి తరానికి మనం కూడబెట్టే అత్యంత విలువైన సంపదన అన్నారు. తెలంగాణలో అడుగంటి పోయిన జలాలను తిరిగి సమకూర్చే దిశగా సాగునీటి, తాగునీటి పధకాలను తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్నదని సీఎం చెప్పారు. మిషన్‌ కాకతీయ, కాళేశ్వరంవంటి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా తెలంగాణలో భూ ఉపరితల జలాల లభ్యతను పెంచడం ద్వారా అడుగంటిన భూగర్భ జలాలను భూ పై పొరల్లోకి చేరే విధంగా జల పునరుజ్జీవన జరుగుతున్నదని అన్నారు. 


తెలంగాణ ప్రజలకు మిషన్‌ భగీరధ కార్యక్రమం ద్వారా తెలంగాణ తాగునీటి కష్టాలను పారదోలడమే కాకుండా, ఫ్లోరైడ్‌ వంటి ఆరోగ్య సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారాన్ని చూపించిందన్నారు. గడిచిన ఆరేళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన చర్యల ద్వారా తెలంగాణ జల వనరుల స్వరూపం గుణాత్మకంగా అభివృద్ధి చెందిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహా ప్రపంచ జల వనరుల నిపుణులు తెలంగాణలో జరుగుతున్న జల పునరుజ్జీవన కార్యక్రమాలను కొనియాడుతుండడం మనకు గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. 

Updated Date - 2021-03-22T23:04:37+05:30 IST