ఏబీఎన్ ఎఫెక్ట్: సీఎం కేసీఆర్ నుంచి కడియంకు పిలుపు

ABN , First Publish Date - 2021-08-27T14:26:06+05:30 IST

పాలనా అనుభవం ఉన్న మాజీ మంత్రి కడియం శ్రీహరికి ప్రాధాన్యత తగ్గించారంటూ ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రసారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు.

ఏబీఎన్ ఎఫెక్ట్: సీఎం కేసీఆర్ నుంచి కడియంకు పిలుపు

వరంగల్: పాలనా అనుభవం ఉన్న మాజీ మంత్రి కడియం శ్రీహరికి ప్రాధాన్యత తగ్గించారంటూ ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రసారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి కడియం శ్రీహరికి పిలుపు అందింది. కరీంనగర్‌లో జరిగే దళితబంధు రివ్యూ సమావేశానికి హాజరుకావాలని కడియంకు కేసీఆర్ చెప్పారు. హుజూరాబాద్‌లో జరిగిన దళితబంధు పథకం ప్రారంభానికి కూడా ఆహ్వాచించకుండా కడియంను అవమానించారని ఏబీఎన్‌లో కథనం ప్రసారమైంది. కడియం వ్యవహారం నిన్న వరంగల్‌కు వచ్చిన కేసీఆర్ దృష్టికి చేరింది. దీంతో వెంటనే కడియం శ్రీహరిని దళితబంధు రివ్యూకు రావాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు.

Updated Date - 2021-08-27T14:26:06+05:30 IST