నేడు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్‌ భేటీ

ABN , First Publish Date - 2021-05-30T12:27:34+05:30 IST

సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‎లో కేబినెట్ సమావేశం జరగనుంది. లాక్‎డౌన్ పొడిగింపుపై కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లాక్‌డౌన్‌తో పాటు పలు కీలక అంశాలపై

నేడు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్‌ భేటీ

హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‎లో ఆదివారం మధ్యాహ్నం కేబినెట్ సమావేశం జరగనుంది. లాక్‎డౌన్ పొడిగింపుపై కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లాక్‌డౌన్‌తో పాటు పలు కీలక అంశాలపై కేబినెట్‌లో చర్చ జరగనున్నట్లు సమాచారం. అయితే..ఇప్పటికే రాష్ట్రంలో కఠినంగా లాక్‎డౌన్ అమలువుతోంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని కార్యకలాపాలకు అనుమతిచ్చారు. ఆ తర్వాత అత్యవసర సేవలు మినహా ఎలాంటి వాటికి అనుమతి లేదు. రోజులో 20 గంటలు లాక్‌డౌన్ విధిస్తున్న విషయం తెలిసిందే. జూన్ నెలలో కూడా లాక్‎డౌన్ అమలు చేస్తారా అన్న ప్రశ్న తెలంగాణ ప్రజల్లో ఉత్కంఠగా మారింది. లేక ఇదే పరిస్థితి ఉంటే మరిన్ని సడలింపులు ఇస్తారా అనే అంశంపై కేబినెట్ సమావేశం అనంతరం సమాచారం రానుంది. లాక్‎డౌన్‎పై స్పష్టత రావాలంటే మరో కొన్ని గంటలు వేచివుండాలి.

Updated Date - 2021-05-30T12:27:34+05:30 IST