సీఎం కేసీఆర్ పరామర్శతో ఆనందంతో ఆ వృద్ధుడు ఏమన్నాడంటే..

ABN , First Publish Date - 2021-05-21T21:49:53+05:30 IST

కేసీఆర్ వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలోకి కోవిడ్ వార్డులలో పర్యటించి రోగులను పరామర్శించారు.

సీఎం కేసీఆర్ పరామర్శతో ఆనందంతో ఆ వృద్ధుడు ఏమన్నాడంటే..

వరంగల్: ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలోకి కోవిడ్ వార్డులలో పర్యటించి రోగులను పరామర్శించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలు, సౌకర్యాలపై ఆరా తీశారు. ఓ వృద్ధుడి వద్దకు వెళ్లి ఆయన ఆరోగ్యపరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. దీంతో ఆ వృద్ధుడు ఆనందంతో ‘జిందాబాద్.. కేసీఆర్ నా రెండో ప్రాణం’ అంటూ నినాదాలు చేశారు.


శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్‌ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించి కోవిడ్ వార్డులలో పర్యటించి రోగులను పరామర్శించారు. కరోనా రోగులకు అందుతున్న వైద్యసేవలు, సౌకర్యాలపై సీఎం ఆరా తీశారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ముఖ్య అధికారులు ఉన్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-05-21T21:49:53+05:30 IST