కేంద్రంపై కేసీఆర్ యుద్దంతో సంతోషం: భట్టి

ABN , First Publish Date - 2021-11-23T22:20:49+05:30 IST

ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ కేంద్రంపై యుద్ధానికి

కేంద్రంపై కేసీఆర్ యుద్దంతో సంతోషం: భట్టి

హైదరాబాద్: ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ కేంద్రంపై యుద్ధానికి వెళ్లినందుకు సంతోషంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా యుద్ధమే అని రోడ్లపై నిరసన తెలిపి అమిత్ షాను కలవగానే యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు ఢిల్లీపై యుద్ధమే అని మళ్లీ అమిత్ షాను కలుస్తా అంటున్నారన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనేవారు లేరన్నారు. ఢిల్లీలో కేసీఆర్ యుద్ధం తేల్చుకుని వచ్చేసరికి ఇక్కడ వడ్లన్నీ మొలకలు వచ్చేలా ఉన్నాయని భట్టి ఎద్దేవా చేశారు. Updated Date - 2021-11-23T22:20:49+05:30 IST