జిల్లాస్థాయి పోటీల విజేతలు వీరే..

ABN , First Publish Date - 2021-12-31T20:05:31+05:30 IST

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలకోన్నత పాఠశాలలో జిల్లా సైన్స్‌ అధికారి అప్పారావు సమక్షంలో జిల్లా స్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీలను గురువారం నిర్వహించినట్లు డీఈవో మహ్మద్‌ అబ్దుల్‌ హై తెలిపారు.

జిల్లాస్థాయి పోటీల విజేతలు వీరే..

మహబూబాబాద్‌ ఎడ్యుకేషన్‌, డిసెంబరు 30 : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలకోన్నత పాఠశాలలో జిల్లా సైన్స్‌ అధికారి అప్పారావు సమక్షంలో జిల్లా స్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీలను గురువారం నిర్వహించినట్లు డీఈవో మహ్మద్‌ అబ్దుల్‌ హై తెలిపారు. ఈ పోటీల్లో మండల స్థాయిలో పాల్గొని విజేతలుగా నిలిచిన 10 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. కాగా, జిల్లా స్థాయి వ్యాసరచన పోటీల్లో ప్రథమ స్థానంలో డోర్నకల్‌ మండలం చిలుకోడు మోడల్‌ స్కూల్‌ విద్యార్థి భవ్య శ్రీ, ద్వితీయ స్థానంలో తొర్రూరు సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ఎం.యశశ్రీ, తృతీయ స్థానంలో చిన్నగూడూరు మండలం జడ్పీహెచ్‌ఎ్‌స విద్యార్థి ఈ.యుగేందర్‌ నిలిచారని పేర్కొన్నారు.


ఉపన్యాస పోటీల ప్రథమ స్థానంలో డోర్నకల్‌ మండలం చిలుకోడు మోడల్‌ స్కూల్‌ విద్యార్థి జి. శరణ్య, ద్వితీయ స్థానంలో గూడూరు మండలం పొనుగోడు జడ్పీహెచ్‌ఎ్‌స విద్యార్థి కె.అరవింద్‌, తృతీయ స్థానంలో తొర్రూరు సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ఎం. మెఘన, డ్రాయింగ్‌ పోటీల్లో ప్రథమ స్థానంలో కురవి మండలం జడ్పీహెచ్‌ఎ్‌స కాంపల్లి విద్యార్థి యామిని, ద్వితీయ స్థానంలో తొర్రూరు మండలం జడ్పీహెచ్‌ఎ్‌స హరిపిరాల విద్యార్థి సాయికుమార్‌, తృతీయ స్థానంలో కురవి మండలం జడ్పీహెచ్‌ఎ్‌స రాజో లు విద్యార్థి కె.తరుణ్‌లు నిలిచినట్లు డీఈవో వెల్లడించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఉపాధ్యాయులు గిరిజ, ఉమ, స్వరూపరాణి, ఓంప్రకాష్‌, రవీందర్‌, శ్రీధర్‌, బాలరాజు, ప్రభాకర్‌, శ్రీనివాస్‌ వ్యవహరించినట్లు చెప్పారు. 

Updated Date - 2021-12-31T20:05:31+05:30 IST