నెల రోజులపాటు దేశమంతటా ‘క్లీన్ ఇండియా’ కార్యక్రమాలు

ABN , First Publish Date - 2021-10-07T22:39:43+05:30 IST

భారతదేశ స్వాతంత్య్రానికి 75 సంవత్సరాల స్మారకార్థం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవం’లో భాగం గా యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నెహ్రూ యువ కేంద్రం, జాతీయ సేవ పథకం సంయుక్తంగా ‘క్లీన్ ఇండియా’ ప్రచారంలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించనుంది.

నెల రోజులపాటు దేశమంతటా ‘క్లీన్ ఇండియా’ కార్యక్రమాలు

హైదరాబాద్: భారతదేశ స్వాతంత్య్రానికి 75 సంవత్సరాల స్మారకార్థం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవం’లో భాగం గా యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నెహ్రూ యువ కేంద్రం, జాతీయ సేవ పథకం సంయుక్తంగా ‘క్లీన్ ఇండియా’ ప్రచారంలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించనుంది.  ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్ లోని  సిజిఓ టవర్స్ ప్రాంగణంలో పత్రికా సమాచార కార్యాలయం, నెహ్రూ యువ కేంద్ర సంస్థ (ఎన్‌వైకెఎస్‌) హైదరాబాద్ వారు  సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఎన్‌వైకెఎస్‌ రాష్ట్ర సంచాలకులు అంశుమన్ ప్రసాద్ దాస్ మాట్లాడుతూ, అక్టోబర్ 1వ తేదీ నుండి 31 తేదీ వరకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘క్లీన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా  నెహ్రూ యువ కేంద్ర సంఘం (ఎన్‌వైకెఎస్‌), ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తెలంగాణాలోని  33 జిల్లాల్లో పలు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. 


గ్రామ, జిల్లా స్థాయిల్లో వ్యర్థ ప్లాస్టిక్ పదార్థాల సేకరణ కోసం ప్రత్యేక ప్రచారం, చారిత్రక కట్టడాలు, వారసత్వ ప్రదేశాలు, పాఠశాలలు, పంచాయితీ కార్యాలయాల వద్ద పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతున్నట్లు అంశుమాన్ దాస్ తెలిపారు. ఈ నెలలో ఎన్‌వైకెఎస్‌ చేపట్టనున్న కార్యక్రమాలను వివరిస్తూ, అక్టోబర్ 1 నుండి 10 వరకు రైల్వే, బస్ స్టేషన్లలో, 11 నుండి 20 వరకు విద్యా సంస్థలు, పబ్లిక్ పార్కులు, చారిత్రక  ప్రదేశాలలో స్వచ్ఛత-పరిశుభ్రతపై పలు పరిశుభ్రత డ్రైవ్‌లు,  అక్టోబర్ 21 నుండి 31  జిల్లా యంత్రాంగం సమన్వయంతో పలు అవగాహన కార్యక్రమాలు, నిర్వహించనునట్లు దాస్ తెలిపారు.ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్ యూత్ ఆఫీసర్ సైదా నాయక్ మాట్లాడుతూ, తెలంగాణలోని  21 యూనివర్శిటీల పరిధిలో పలు కళాశాల నుండి 1,39,800 మంది వాలంటీర్లు ఈ  క్లీన్ ఇండియా ప్రోగ్రామ్ లో  భాగస్వామ్యమవుతున్నారని ఆయన అన్నారు. 


తెలంగాణలో 1391 గ్రామాలను ఎన్‌ఎస్‌ఎస్  దత్తత తీసుకుందని, గత వారం రోజుల్లో  మొత్తం 354 కిలోల సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ వ్యర్థాలను 21,154 మంది ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు సేకరించారాని ఆయన పేర్కొన్నారు.పిఐబి, ఆర్ఒబి ప్రాంతీయ సంచాలకురాలు శృతి పాటిల్ మాట్లాడుతూ, భారత స్వాతంత్య్ర 75 సంవత్సరాల స్మారకార్థం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌’లో భాగంగా భారత ప్రభుత్వం పరిశుభ్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా అక్టోబర్ 1న ఈ ‘క్లీన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు.ఎన్‌వైకెఎస్‌ జిల్లా అధికారి ఖుష్బూ గుప్తా, ఎన్ఎస్ఎస్ యూత్ అసిస్టెంట్ కె.సి. రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Updated Date - 2021-10-07T22:39:43+05:30 IST