జనవరి 6 వరకు ‘స్వచ్ఛ నగర చాలెంజ్‌’

ABN , First Publish Date - 2021-12-30T17:53:15+05:30 IST

వరంగల్‌కు కొత్త వాగ్దానం పేరిట జీడబ్ల్యూఎంసీ నిర్వహించే స్వచ్ఛ వినూత్న ఆలోచన చాలెంజ్‌ పోటీల గడువును జనవరి 6వతేదీ వరకు..

జనవరి 6 వరకు ‘స్వచ్ఛ నగర చాలెంజ్‌’

జీడబ్ల్యూఎంసీ(హనుమకొండ సిటీ), డిసెంబరు 29: వరంగల్‌కు కొత్త వాగ్దానం పేరిట జీడబ్ల్యూఎంసీ నిర్వహించే స్వచ్ఛ వినూత్న ఆలోచన చాలెంజ్‌ పోటీల గడువును జనవరి 6వతేదీ వరకు పొడిగిస్తున్నట్లు కమిషనర్‌ ప్రావీణ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలో శానిటేషన్‌ను మరింత సమర్ధవంతంగా నిర్వహించే ఉద్దేశంతో నగరవాసులు, ఆర్‌డబ్ల్యూఏఎస్‌, ఎన్‌జీవో్‌స, విద్యా సంస్థలు, స్టార్ట్‌పల నుంచి బల్దియా పోటీల ద్వారా సూచనలు, సలహాలను స్వీకరించనుంది. తొలుత డిసెంబర్‌ 31 వరకు పోటీల గడువును ప్రకటించిన బల్దియా జనవరి 6 వరకు పొడించినట్లు ప్రకటించింది. సాయం త్రం 5 గంటల్లోగా పబ్లిక్‌హెల్త్‌.జీడబ్ల్యూఎంసీఎట్‌దరేటా్‌ఫజీమెయిల్‌.కామ్‌ మెయిల్‌ ఐడీకి సమర్పించాలి. మరిన్ని వివరాలకు 97041-16215 నెంబర్‌ను సంప్రదించాలని కమిషనర్‌ ప్రావీణ్య సూచించారు. వరంగల్‌ను క్లీన్‌సిటీగా మార్చేందుకు సోషల్‌ క్లీనర్ల కోసం ఆవిష్కరణల ను థీమ్‌లుగా చేర్చడం, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రీసైక్లింగ్‌లో భాగంగా జీరో డంప్‌గా మార్చడం, ప్లాస్టిక్‌ ప్రత్యామ్నాయాలు, పారదర్శక పారిశుధ్యం, వ్య ర్ధాల నిర్వహణ, రీసైక్లింగ్‌ అంశాలు ప్రతిపాదించాలని పేర్కొన్నారు. ఉత్తమ ప్రతిపాదనలకు ప్రఽథమ బహుమతిగా రూ.15వేలు, రెండవ బహుమతిగా రూ.10 వేలు, మూడవ బహుమతిగా రూ.5వేలు పొందవచ్చు.

Updated Date - 2021-12-30T17:53:15+05:30 IST