తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించిన సీజేఐ ఎన్వీ రమణ

ABN , First Publish Date - 2021-12-19T18:12:23+05:30 IST

తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభినందించారు.

తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించిన సీజేఐ ఎన్వీ రమణ

హనుమకొండ: తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభినందించారు. ఆదివారం వరంగల్ కోర్టు భవనాల సముదాయాన్ని సీజేఐ ప్రారంభించి ప్రసంగించారు. కోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఈ కోర్టును నిర్మించడం అభినందనీయమని కొనియాడారు. ముందుగా కాళోజీ నారాయణ రావు కవితలను చదివి వినిపిస్తూ  సీజేఐ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలుగులో మాట్లాడటం గర్వంగా ఉందన్నారు. ఓరుగల్లుతో తనకు ఎంతో విడదీయరాని బంధం ఉందని తెలిపారు. ప్రగతిశీల ఉద్యమాలకు పుట్టినిల్లు ఓరుగల్లు అని అన్నారు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన నేల అని చెప్పారు. ‘‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’’ అంటూ దాశరథి శతకాన్ని ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ గుర్తు చేశారు. 

Updated Date - 2021-12-19T18:12:23+05:30 IST