ధాన్యం నాణ్యత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి: మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

ABN , First Publish Date - 2021-10-07T22:21:01+05:30 IST

యాసంగి (2020-21) సీజన్ లోని కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)కు సంబంధించి రైసు మిల్లుల్లో ఉన్న ధాన్యం నాణ్యత ప్రమాణాలు దెబ్బ తినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పౌరసరఘాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి రైసు మిల్లర్లను, జిల్లా అధికారులను ఆదేశించారు

ధాన్యం నాణ్యత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి: మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: యాసంగి (2020-21) సీజన్ లోని కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)కు సంబంధించి రైసు మిల్లుల్లో ఉన్న ధాన్యం నాణ్యత ప్రమాణాలు దెబ్బ తినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పౌరసరఘాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి రైసు మిల్లర్లను, జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో అధికారులు, మిల్లర్లు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గత ఏడాది యాసంగిలో రికార్డుస్థాయిలో 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి సీఎంఆర్ కోసం మిలర్లకు అప్పగించడం జరిగిందని, అయితే భారత ఆహార సంస్థ నుంచి ఎదురవుతున్న ప్రతిబంధకాల వల్ల బియ్యం అప్పగించడంలో జాప్యం జరుగుతోందని దీంతో మిల్లుల్లోనే 70 శాతం ధాన్యం నిల్వలు ఉ న్నాయని అన్నారు.


యాసంగి సీజన్ సీఎంఆర్ సేకరణ, ఎఫిసిఐ నుంచి ఎదురవుతున్న సమస్యలపై గురువారంనాడు పౌరసరఫలభవన్లో కమిషనర్ అనిల్ కుమార్ తో కలిసి ఆయన రైసు మిల్లర్లతో సమీక్షించారు. డిమాండ్ మేరకు ఎఫ్ సిఐ స్టోరేజ్ స్పెస్ కల్పించడం లేదని 32 జిల్లాల నుంచి సమావేశంలో పాల్గొన్న రైసు మిల్లర్లు ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు. గోదాములను లీజుకు తీసుకునే విషయంలో ఎఫ్ సిఐ ఈ ఏడాది కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలతో సమస్యలు వస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు చేపట్టిన రైతు సంక్షేమ చర్యల వల్ల రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరగి ధాన్యం దిగుబడులు పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా జోక్యం చేసుకోవడం వల్ల యాసంగికి సబంధించి అదనంగా 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైసు తీసుకోవడానికి ఎస్ఎసిఐ అంగీకరించిందన్నారు. ఎస్ఎసిఐ నుంచి ఎదురవుతున్న సమస్యలను అధిగమించే ప్రయత్నం చేస్తున్నామని ఈ నేపథ్యంలో మిల్లర్లు కూడా ప్రభుత్వానికి సహకరించాలని మిల్లర్లుకు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-10-07T22:21:01+05:30 IST