ఎన్ సి టీ వో21 జాతీయ సదస్సుకు రఘునందన్ కు ఆహ్వానం

ABN , First Publish Date - 2021-08-10T23:32:33+05:30 IST

ప్రజల ఆరోగ్యాన్ని సవాలు చేస్తున్న పొగాకు ను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఆ దిశగా, జరుగుతున్న కృషిలో ఔత్సాహిక స్వచ్చంద కార్యకర్తల సహకారం అవశ్యమనీ పొగాకు

ఎన్ సి టీ వో21 జాతీయ సదస్సుకు రఘునందన్ కు ఆహ్వానం

హైదరాబాద్: ప్రజల ఆరోగ్యాన్ని సవాలు చేస్తున్న పొగాకు ను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఆ దిశగా, జరుగుతున్న కృషిలో ఔత్సాహిక స్వచ్చంద కార్యకర్తల సహకారం అవశ్యమనీ పొగాకు, ఆరోగ్యం ఆన్న అంశం మీద జరుప తలపెట్టిన నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ టుబాకో21 ( ఎన్ సీ టీ ఓ హెచ్ 21) సదస్సుకు హైదరాబాద్ కు చెందిన మాచన రఘునందన్ కు పిలుపు వచ్చింది. ఈ సదస్సు లో స్వచ్చంద కార్యకర్త గా పాల్గొనాల్సిందిగా సదస్సు నిర్వాహకులు కోరారు. పొగాకు రహిత భారతావని ధ్యేయంగా  పంజాబ్ రాష్ట్రం లో చండీగఢ్ కేంద్రం గా ఉన్న స్నాతకోత్తర ప్రజా ఆరోగ్య అధ్యయన సంస్థ పీ జీ ఐ ఎమ్ ఈ ఆర్ అధ్వర్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ టుబాకో , హెల్త్ పేరిట జాతీయ సదస్సును సెప్టెంబర్ 25,27 తేదీల్లో పంజాబ్ చండీగఢ్ లో నిర్వహిస్తోంది.


పొగాకు ,ధూమపానం వ్యసనం వల్ల కరోనా బారిన పడే అవకాశం ఉంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ గత సంవత్సరం నుంచి పదే పదే హెచ్చరిస్తోనే ఉంది. ఈ కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో పొగాకు నియంత్రణ ఆవశ్యకత పై కీలకంగా జరగనున్న ఈ చారిత్రక సదస్సుకు హాజరు కావాలని కోరుతూ పౌరసరఫరాలశాఖ లో ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ గా పని చేస్తున్న మాచన రఘునందన్ కు ఆహ్వానం అందింది.

Updated Date - 2021-08-10T23:32:33+05:30 IST