ఫుట్ పాత్ పై మహిళ ధీన స్ధతికి స్పందించిన అధికారి

ABN , First Publish Date - 2021-11-21T21:37:30+05:30 IST

మనసున్న మనిషిగా....మానవత్వాన్ని చాటుకున్నరా అధికారి. పౌరసరఫరాలశాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ తన కళ్లముందు కనిపించిన ఘటనకు స్పందించారు.

ఫుట్ పాత్ పై మహిళ ధీన స్ధతికి స్పందించిన అధికారి

హైదరాబాద్: మనసున్న మనిషిగా....మానవత్వాన్ని చాటుకున్నరా అధికారి. పౌరసరఫరాలశాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ తన కళ్లముందు కనిపించిన ఘటనకు స్పందించారు. అందరు ఉద్యోగుల్లా తన పని తాను చేసుకుపోయే వ్యక్తి లా కాకుండా తనకు తోచిన సాయాన్ని అందించారు. గత వారం రోజులుగా నగరంలో చలి వాతావరణం, మరో పక్క బిడ్డను చలి నుంచి కాపాడుకోవాలన్నతపన ఆ తల్లిది. 


సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ వద్ద పికెట్ 6రోడ్ల కూడలి లో ఫూట్ పాత్ పై ఓ మహిళ, పసి వాణ్ణి చలి నుంచి కాపాడుతూ.. పడుకోబెట్టిన  దృశ్యం చూసి రఘునందన్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ సమీపం లో చల్ల చలిలో ముక్కు పచ్చ లారని పసి వాణ్ణి ఓ గుర్తు తెలియని మహిళ తన పొత్తిళ్ళ వేడితో పడుకోబెట్టి ఫూట్ పాత్ పై నుంచి కింద పడనివ్వకుందా అదిమి పట్టుకుంది , ప్రకృతి నీ సవాలు చేస్తున్న ఆమె మాతృత్వానికి తన వంతు సాయంగా ఆహారం, దుస్తులు అవసరమైన వి కొనుక్కొమ్మని కొంత డబ్బు సాయం చేశారు. అలాగే  స్థానికంగా ఉండే ఓ స్వచ్చంద సంస్థకు  విషయం చెప్పి ఆమెకు నిత్యావసరాలు అందించమని చెప్పారు.


Updated Date - 2021-11-21T21:37:30+05:30 IST