రేషన్ షాపులకు బోర్డు లేక పోతే చర్యలు: డీటీ రఘునందన్

ABN , First Publish Date - 2021-07-08T20:30:34+05:30 IST

రేషన్ షాపులు నిర్వహించే వారు తప్పని సరిగా బోర్డులు ఏర్పాటు చేయాల్సిందేనని, లేక పోతే చర్యలు తప్పవని నారాయణపేట జిల్లా పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు.

రేషన్ షాపులకు బోర్డు లేక పోతే చర్యలు: డీటీ రఘునందన్

నారాయణపేట: రేషన్ షాపులు నిర్వహించే వారు తప్పని సరిగా బోర్డులు ఏర్పాటు చేయాల్సిందేనని, లేక పోతే చర్యలు తప్పవని నారాయణపేట జిల్లా పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. జిల్లాలోని మరికల్ పసుపుల గ్రామం చౌక దుకాణం ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌక దుకాణాల ను నిర్లక్ష్యం గా నిర్వహిస్తే డీలర్ షిప్ రద్దు కు సైతం వేకకాడేది లేదని హెచ్చరించారు. కొందరు డీలర్లు రేషన్ దుకాణాల నిర్వహణ ను తేలిగ్గా తీసుకుంటున్నరనీ, ఎంతో భాద్యతగా భావించాల్సిన ప్రతిష్టాత్మక  జాతీయ ఉత్పత్తి పథకం ను ఇష్టా రాజ్యంగా నడుపుతున్నారన్న ఫిర్యాదులు అందుతున్న దరిమిలా ప్రతీ రేషన్ షాపును ఖచ్చితంగా తనిఖీ చేస్తానని చెప్పారు. 


కొందరు డీలర్లు రేషన్ ను తూకం వేసే టపుడు ఖాళీ సంచుల బరువు ను తూకం లో కలిపి ఇస్తున్నారు ఆన్న ఆరోపణలు వచ్చాయన్నారు. అందుకే రేషన్ షాపులను తనిఖీ చేయనున్నట్లు రఘునందన్ తెలిపారు. తద్వారా ఎటువంటి అక్రమాలు జరగకుండా చెక్ పెట్ట వచ్చు అని అన్నారు.కొందరు డీలర్లు ఏకంగా షాపులకు బోర్డులు సైతం పెట్టడం లేదని అది నిభందనలకు విరుద్ధమని చెప్పారు. ఎంత వెదికినా బోర్డులు దొరకకుండా రేషన్ షాపులను కేరాఫ్ అడ్రస్ లేని వాటిగా మారుస్తున్న ఉదంతాలు విస్మయం కలిగిస్తున్నాయని అన్నారు.  బోర్డులు సైతం ఏర్పాటు చెయ్యలేకపోతే, దుకాణం నిర్వహణ అనేది ప్రహసనం అవుతుందని ఆయన అభిప్రాయ పడ్డారు.

Updated Date - 2021-07-08T20:30:34+05:30 IST