నర్సంపేటలో మిరప ఆధారిత పరిశ్రమ
ABN , First Publish Date - 2021-03-24T08:37:12+05:30 IST
రాష్ట్రంలో వ్యవసాయ దిగుబడులు, ఆహార ఉత్పత్తులు గణనీయంగా పెరిగే రోజులు ముందున్నాయని, అందుకే వ్యవసాయాధారిత, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపై దృష్టిసారించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

గ్రామీణ ప్రాంతాలకు పరిశ్రమల విస్తరణే లక్ష్యం: కేటీఆర్
హైదరాబాద్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వ్యవసాయ దిగుబడులు, ఆహార ఉత్పత్తులు గణనీయంగా పెరిగే రోజులు ముందున్నాయని, అందుకే వ్యవసాయాధారిత, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపై దృష్టిసారించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట ప్రాంతంలో ‘చపాటా’ రకం మిరప పండిస్తున్నందున, నర్సంపేట పట్టణంలో మిరప ఆధారిత పరిశ్రమను నెలకొల్పనున్నట్లు ప్రకటించారు. శాసనసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఏ ప్రాంతంలో ఏ పంట ఎక్కువగా పండిస్తే ఆ ప్రాంతంలో అందుకు అనుబంధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పుతామన్నారు. గ్రామీణ ప్రాంతాలకు పరిశ్రమలను విస్తరింపజేస్తామని ఆయన చెప్పారు.