దిక్కు తోచని ఆ నలుగురు..

ABN , First Publish Date - 2021-10-29T05:05:02+05:30 IST

దిక్కు తోచని ఆ నలుగురు..

దిక్కు తోచని ఆ నలుగురు..
అనాథగా మారిన పిల్లలు

చిట్యాల, అక్టోబరు 28: గుడుంబా రక్కసి తండ్రిని మింగేసింది. దీంతో ఆ పిల్లల పోషణ భారం తల్లిపై పడింది. మూడేళ్లుగా కూలినాలి చేసి కుటుంబాన్ని నెట్టు కొస్తున్న ఆమె అనారో గ్యంతో మృతి చెందింది. నలుగురు పిల్లలను అనాథలుగా చేసి కానరా నిలోకానికి వెళ్లింది. ఈ సంఘటన చిట్యాల మండ లంలో   చోటుచే సుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. పాశిగడ్డతం డాకు చెందిన వసంత (35) భర్త గుడుం బాకు బానిసై మూడేళ్ల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి నలుగురు పిల్లలను ఆమె పోషించు కుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే అనారోగ్య బారిన పడింది. గురువారం మృతి చెందింది. దీంతో నలుగురు పిల్లలు దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు. తండ్రిని కోల్పోయిన ఆ బాలలకు తల్లి కూడా దూరమైపోయింది. మృతురాలి పెద్ద కుమారుడు తిరుపతి పదో తరగతి చదువు తుండగా రెండో కుమారుడు లక్‌పతి ఆరో తరగతిలో ఉన్నాడు. కుమార్తె సంజన నాలుగో తరగతి, చిన్న కుమారుడు రాజేశ్‌ ఒకటో తరగతిలో ఉన్నారు. తల్లి మృతి చెందడంతో ఆ పిల్లల రోదనలు మిన్నంటాయి.  గ్రామ స్థులు చందాలు వేసుకుని అంత్యక్రియలు నిర్వహిం చారు. ఈ బాలలను ప్రభుత్వం ఆదుకోవాలని  సర్పంచ్‌ లావుడ్యా రజిత కోరారు. 


Updated Date - 2021-10-29T05:05:02+05:30 IST