చెన్నమనేని రమేశ్‌ జర్మనీ పౌరుడే

ABN , First Publish Date - 2021-12-30T07:45:52+05:30 IST

వేములవాడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ ఈరోజు వరకు

చెన్నమనేని రమేశ్‌ జర్మనీ పౌరుడే

హైకోర్టుకు స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం

హైదరాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): వేములవాడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ ఈరోజు వరకు కూడా జర్మనీ పౌరుడేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి హైకోర్టుకు స్పష్టంచేసింది. చెన్నమనేని రమేశ్‌ పౌరసత్వానికి సంబంధించిన అంశం జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం ఎదుట బుధవారం విచారణకు వచ్చింది. కేంద్రం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ నామవరపు రాజేశ్వర్‌రావు వాదనలు వినిపిస్తూ... చెన్నమనేని రమేశ్‌ జర్మనీ పౌరుడేనని కోర్టుకు తెలిపారు.


రమేశ్‌ తరఫు న్యాయవాది వై.రామారావు వాదనలు వినిపిస్తూ... పౌరసత్వ రద్దు ఉత్తర్వులు చెల్లవని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ప్రతివాది ఆది శ్రీనివాస్‌ తరఫు న్యాయవాది రవికిరణ్‌రావు వాదనలు వినిపిస్తూ... ఏళ్లతరబడి ఈ అంశం ముందుకుసాగడం లేదని కోర్టుకు తెలిపారు. పౌరసత్వం రద్దు ఉత్తర్వులపై ఎవరు సంతకం చేశారన్నది ముఖ్యం కాదన్నారు. వాదనలు వినిపించేందుకు తమకు మరికొంత సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏఏజీ జె.రామచంద్రరావు కోర్టును కోరారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం... విచారణను సోమవారానికి వాయిదావేసింది.


Updated Date - 2021-12-30T07:45:52+05:30 IST