భూసేకరణ వివాదాలకు చెక్‌.. ధరణిలో కొత్త ఆప్షన్‌

ABN , First Publish Date - 2021-05-30T08:02:34+05:30 IST

భూసేకరణతో ముడిపడిన సమస్యల పరిష్కారానికి ధరణిలో కొత్త ఆప్షన్‌ అందుబాటులోకి వచ్చింది.

భూసేకరణ వివాదాలకు చెక్‌.. ధరణిలో కొత్త ఆప్షన్‌

హైదరాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): భూసేకరణతో ముడిపడిన సమస్యల పరిష్కారానికి ధరణిలో కొత్త ఆప్షన్‌ అందుబాటులోకి వచ్చింది. భూసేకరణ తర్వాత రైతు/భూ యాజమానుల వద్ద మిగిలిన విస్తీర్ణానికి పాస్‌పుస్తకం వచ్చేలా కొత్త ఆప్షన్‌ ఇచ్చారు. ఉదాహరణకు యాదాద్రి భువనగిరి జిల్లాలో జాతీయ రహదారి విస్తరణకు ఐదెకరాలు కలిగిన ఒక రైతు నుంచి నాలుగున్నర ఎకరాలు సేకరించి.. మిగిలిన భూమికి పాస్‌పుస్తకం ఇవ్వకుండా పక్కనపెడితే.. ఆ భూమికి పాస్‌పుస్తకం పొందేలా కొత్త ఆప్షన్‌ను శనివారం నుంచి అందుబాటులోకి తెచ్చారు.  రైతులు మీసేవలో లేదా ధరణిలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

Updated Date - 2021-05-30T08:02:34+05:30 IST