నాటా రెండో టెస్ట్ షెడ్యూల్‌లో మార్పులు
ABN , First Publish Date - 2021-05-21T09:07:59+05:30 IST
నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (నాటా)-2021 రెండో షెడ్యూల్‌లో మార్పులు చేస్తున్నట్లు కౌన్సిల్ ఆఫ్ ఆ

హైదరాబాద్, మే 20 (ఆంధ్రజ్యోతి): నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (నాటా)-2021 రెండో షెడ్యూల్‌లో మార్పులు చేస్తున్నట్లు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ తెలిపింది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రెండో టెస్టు జూన్-12న జరగాల్సి ఉంది. అయితే, అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఉన్న నేపథ్యంలో ఈ పరీక్ష జూలై-11న నిర్వహించనున్నట్లు గురువారం ప్రకటించింది.