చంపాపేట్ రహదారిపై సింగరేణి కాలనీవాసుల ధర్నా
ABN , First Publish Date - 2021-09-10T16:23:03+05:30 IST
చంపాపేట్ రహదారిపై సింగరేణి కాలనీవాసులు ధర్నాకు దిగారు. బాలికను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్: చంపాపేట్ రహదారిపై సింగరేణి కాలనీవాసులు ధర్నాకు దిగారు. బాలికను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. ఆందోళనకారులతో మాట్లాడి తక్షణ సాయం కింద కలెక్టర్ రూ.50 వేలు అందజేశారు. చంపాపేట్ రహదారిపై పోలీసులు భారీగా మోహరించారు.