నేడు ‘చాంబర్‌’ ఎన్నికలు

ABN , First Publish Date - 2021-08-27T05:52:38+05:30 IST

నేడు ‘చాంబర్‌’ ఎన్నికలు

నేడు ‘చాంబర్‌’ ఎన్నికలు

వరంగల్‌ టౌన్‌,  ఆగస్టు 26 : వరంగల్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఎన్నికలు శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్నాయి. ఎన్నికల అనంతరం ఓట్ల లెక్కింపు, విజేతల పేర్లను ప్రకటిస్తారు. నెల రోజుల నుంచి చాంబర్‌ ఎన్నికలను పురస్కరించుకుని రెండు ప్యానళ్ల సభ్యులు ప్రచారం నిర్వహించారు. ఒక గ్రూపు వారు ఎదుటి గ్రూపులోని సభ్యులను లాక్కునేందుకు యత్నించారు. ఎవరు చెబితే ఓటు పడుతుందో.. వారితో చెప్పించేందుకు నానాతంటాలు పడ్డారు. రాజకీయ నాయకులతో ఫోన్లు చేయించి హెచ్చరికలు ఇచ్చిన పరిస్థితులూ ఉన్నాయి.  కులాలు, వర్గాలు, మద్యం, మందు, విందులతో ఓట్లను లాగేందుకు ప్రయత్నాలు చేశారు. 

Updated Date - 2021-08-27T05:52:38+05:30 IST