అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు
ABN , First Publish Date - 2021-09-04T05:07:53+05:30 IST
అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
కమలాపూర్, సెప్టెంబరు 3 : పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం అందిస్తుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. కమలాపూర్ మండలంలోని కానిపర్తి, దేశరాజుపల్లి, పంగిడిపల్లి, వంగపల్లి, మర్రిపల్లి, మర్రిపల్లి గూడెం, అంబాల గ్రామాలలో శుక్రవారం ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే ధర్మారెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పెరియాల రవీందర్‌రావులు పర్యటించారు. ఈ సందర్భంగా పలు గ్రామాలలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు నాయకులు, యువకులు భారీ సంఖ్యలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యేలు గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, మండలంలోని ఉప్పల్ గ్రామంలో వర్తక, వాణిజ్య, చేతివృత్తుల దుకాణాల సముదాయాలలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రచారం చేశారు. అనంతరం కమలాపూర్‌లో వార్డుల వారీగా టీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు స్వర్గం రవి, మారపల్లి నవీన్‌కుమార్, తక్కళ్లపల్లి సత్యనారాయణరావు, ఇంద్రసేనారెడ్డి, సర్పంచ్‌లు దేవేందర్‌రావు, రవీందర్, ఎంపీటీసీ సంపత్‌రావు,తిరుపతిరెడ్డి, ముజీబ్ హుస్సేన్,శ్రీధర్‌రావు పాల్గొన్నారు.
6న కమలాపూర్‌కు మంత్రి హరీ్‌షరావు రాక
కమలాపూర్‌కు ఈనెల 6న ఆర్థిక శాఖ మంత్రి హరీ్‌షరావు రానున్నట్టు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి హరీ్‌షరావు, టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివా్‌సయాదవ్‌లు రోడ్ షో, దూమ్ ధామ్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి కమలాపూర్ బస్టాండ్ సమీపంలో శుక్రవారం సాయంత్రం బాల్క సుమన్ స్థల పరిశీలన చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పెరియాల రవీందర్‌రావు, కృష్ణప్రసాద్, దఽశరథం, అశోక్, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.