కులాలవారీ గణనలో ఆర్థికాంశాలు ఉండాలి

ABN , First Publish Date - 2021-08-27T10:18:29+05:30 IST

కులాలవారీ జనగణనలో ఆర్థిక పరమైన అంశాలను కూడా పొందుపరచాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ కేంద్ర ప్రభుత్వానికి

కులాలవారీ గణనలో ఆర్థికాంశాలు ఉండాలి

హైదరాబాద్‌, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): కులాలవారీ జనగణనలో ఆర్థిక పరమైన అంశాలను కూడా పొందుపరచాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  మగ్ధూంభవన్‌లో గురువారం జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గసమావేశంలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. నల్లడబ్బును తెల్లడబ్బుగా మార్చేక్రమంలో బీజేపీకి రెండున్నర లక్షల కోట్ల రూపాయల వాటా ఉందని ఆరోపించారు. ఒకవైపు మతోన్మాదం, మరోవైపు ఆర్థిక మాంద్యం దేశానికి ప్రమాదకరంగా మారాయన్నారు.  కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దయాదాక్షిణ్యాలు ఉన్నంత వరకూ ఏపీసీఎం జగన్‌కు ఎలాంటి ప్రమాదం లేదన్నారు. 

Updated Date - 2021-08-27T10:18:29+05:30 IST