ప్రయాణికులు లేక 25 రైళ్ల రద్దు

ABN , First Publish Date - 2021-05-02T09:03:03+05:30 IST

కరోనా తీవ్రతతో ప్రయాణికుల రద్దీ తగ్గిపోవడంతో దక్షిణ మధ్య రైల్వే 25 రైళ్లను రద్దు చేసింది.

ప్రయాణికులు లేక 25 రైళ్ల రద్దు

హైదరాబాద్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): కరోనా తీవ్రతతో ప్రయాణికుల రద్దీ తగ్గిపోవడంతో దక్షిణ మధ్య రైల్వే 25 రైళ్లను రద్దు చేసింది. కరోనా తీవ్రత తగ్గి, ప్రయాణికుల ఆదరణ పెరిగితే వీటిని పునరుద్ధరిస్తామని ప్రకటించింది. దీంతో ఈ వారం రోజుల్లో రద్దయిన రైళ్ల సంఖ్య 35కు చేరింది. ఇవన్నీ ఏప్రిల్‌ నెలలో పునరుద్ధరించిన ప్రత్యేక రైళ్లే. ఈ నెల 2, 3, 4, 7, 8, 10 తేదీల్లో నడవాల్సిన ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. జోన్‌ పరిధిలోని ఔరంగాబాద్‌-నాందెడ్‌, నాందెడ్‌-ఔరంగాబాద్‌, ఆదిలాబాద్‌-నాందెడ్‌, నాందెడ్‌-ఆదిలాబాద్‌, వికారాబాద్‌-గుంటూరు, గుంటూరు- వికారాబాద్‌, సికింద్రాబాద్‌- యశ్వంత్‌పూర్‌, యశ్వంత్‌పూర్‌- సికింద్రాబాద్‌, తిరుపతి-మన్నార్‌గుడి, మన్నార్‌గుడి- తిరుపతి, రేపల్లె-కాచిగూడ, కాచిగూడ-రేపల్లె, కాచిగూడ-గుంటూరు, గుంటూరు-కాచిగూడ, సికింద్రాబాద్‌- షిర్డీ, షిర్డీ-సికింద్రాబాద్‌, తిరుపతి-చెన్నై సెంట్రల్‌, చెన్నై సెంట్రల్‌-తిరుపతి, సికింద్రాబాద్‌-విశాఖపట్నం, విశాఖపట్నం-సికింద్రాబాద్‌, ఔరంగాబాద్‌-రేణిగుంట, రేణిగుంట-ఔరంగాబాద్‌, పర్బని-నాందెడ్‌ ట్రెయిన్‌లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. 2న బయలుదేరాల్సిన నాందెడ్‌-తాండూరు ట్రెయిన్‌ను సికింద్రాబాద్‌ వరకే పరిమితం చేస్తున్నట్లు తెలిపింది. 3న బయలుదేరాల్సిన తాండూరు-పర్బని ట్రెయిన్‌ను పాక్షికంగా రద్దు చేసినట్లు వివరించింది. 


Updated Date - 2021-05-02T09:03:03+05:30 IST