టైమ్‌ టు సే... బైబై కేసీఆర్‌!

ABN , First Publish Date - 2021-10-21T09:05:58+05:30 IST

బైబై కేసీఆర్‌ అని చెప్పే రోజు వచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

టైమ్‌ టు సే... బైబై కేసీఆర్‌!

సీ ఓటర్‌ సర్వేను ఉటంకిస్తూ రేవంత్‌ ట్వీట్‌

‘ఆర్టీఐ’పై ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్‌


హైదరాబాద్‌, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): బైబై కేసీఆర్‌ అని చెప్పే రోజు వచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సీ ఓటర్‌ సర్వే ప్రకారం ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉన్న సీఎంగా కేసీఆర్‌ నిలిస్తే.. కాంగ్రెస్‌ పాలిత ఛత్తీ్‌సగఢ్‌ సీఎం భూపే్‌షభాగెల్‌ అధిక జనామోదం పొందిన సీఎంగా నిలిచారని గుర్తు చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్విట్‌ చేశారు. కాగా, సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రంగా యూపీఏ ప్రభుత్వం ఆర్టీఐ చట్టాన్ని తీసుకువస్తే.. ఆ హక్కును కాలరాస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని మండిపడ్డారు. దోపిడీని కప్పి పుచ్చడమే ఈ ఉత్తర్వుల్లోని మర్మమని, దాన్ని తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మరో ట్విట్‌ చేసిన రేవంత్‌రెడ్డి.. ‘ఆంధ్రజ్యోతి’లో బుధవారం ప్రచురితమైన కథనాన్నీ పోస్ట్‌ చేశారు. 

Updated Date - 2021-10-21T09:05:58+05:30 IST