‘ఫిట్‌నె్‌స’కు వెనకడుగు

ABN , First Publish Date - 2021-10-31T05:50:57+05:30 IST

‘ఫిట్‌నె్‌స’కు వెనకడుగు

‘ఫిట్‌నె్‌స’కు వెనకడుగు


మట్టెవాడ, అక్టోబరు 30: ప్రైవేట్‌ విద్యా సంస్థల బస్సులకు సెప్టెంబరు చివరి వరకు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించుకునేందుకు కేంద్రం అవకాశమిచ్చిన విషయం తెలిసిందే. అయినా ఫిట్‌నెస్‌ ధ్రువీకరణకు ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యలు ముందుకు రావడం లేదు. ఉమ్మడి వరంగల్‌  జిల్లాలో 2,029 ప్రైవేట్‌ బస్సులు ఉండగా, ఇప్పటి వరకు కేవలం 168 బస్సులు మాత్రమే ఫిట్‌నెస్‌ పూర్తయింది. ఇంకా 1,881 బస్సులు ఫిట్‌నెస్‌ నిరూపణ కావాల్సి ఉంది. 

భారం అవుతున్న బడి బస్సులు

కొవిడ్‌ కారణంగా 2020 మార్చి నుంచి ఆయా పాఠశాలలను పూర్తిగా మూసివేశారు. దీంతో ప్రైవేట్‌ పాఠశాల బస్సులను పక్కన పెట్టారు. బస్సులు బయట తిరగకపోవడంతో బ్యాటరీలు పాడవడం, ఇంజన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో బస్సుల మరమ్మతుకు వెలల్లో ఖర్చవుతోందని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు వాపోతున్నాయి. బస్సులకు ఫిట్‌నె్‌సతో కోసం ఇన్సూరెన్స్‌, త్రైమాసిక ట్రాక్సీ డబ్బులు చెల్లించాల్సి రావడంతో ఆర్థిక భారం  పడుతోందని పేర్కొంటున్నారు. 


ఉమ్మడి జిల్లాలో విద్యాసంస్థల బస్సుల వివరాలు

జిల్లా                       బస్సులు        ఫిట్‌నెస్‌     ఫిట్‌నెస్‌ కానవి

హనుమకొండ             976         94     882

వరంగల్‌             429         26     403

జనగామ             192         11     181

భూపాల్‌పల్లి             230         36     194

మహబూబాబాద్‌ (ములుగు) 222         1         121

Updated Date - 2021-10-31T05:50:57+05:30 IST