అడిగిన వారందరికీ బస్సులు
ABN , First Publish Date - 2021-11-28T08:45:50+05:30 IST
ప్రయాణికుల డిమాండ్ మేరకు టీఎ్సఆర్టీసీ ఆయా ప్రాంతాల్లో బస్సులను పునరుద్ధరించడంతో పాటు కొత్త బస్సుల ను ప్రవేశపెట్టి ఆదాయాన్ని పెంచుకునేందుకు కసరత్తు చేస్తోంది.

ఆదాయం పెంచుకునేందుకు ఆర్టీసీ అధికారుల కసరత్తు
హైదరాబాద్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికుల డిమాండ్ మేరకు టీఎ్సఆర్టీసీ ఆయా ప్రాంతాల్లో బస్సులను పునరుద్ధరించడంతో పాటు కొత్త బస్సుల ను ప్రవేశపెట్టి ఆదాయాన్ని పెంచుకునేందుకు కసరత్తు చేస్తోంది. వ్యాపార, వాణి జ్య కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభంకావడం, విద్యాసంస్థలు తెరచుకోవడంతో సాధారణ బస్సులతోపాటు రెండున్నర నెలల్లో అదనంగా 510 బస్సులతో 1934 అదనపు ట్రిప్పులతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతోంది. దీంతో ఇంతకుముందు రోజుకు రూ.8-9కోట్ల ఆదాయానికి పరిమితమైన ఆర్టీసీ తాజాగా రోజుకు రూ.11-12 కోట్ల వరకు సరాసరి ఆదాయాన్ని పెంచుకోగలిగింది. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడంపై దృష్టిసారించారు. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి కరోనా కారణంగా రద్దు చేసిన మార్గాల్లో బస్సులను పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నారు.
కార్గో, పార్సిల్ హోం డెలివరీ చార్జీలు తగ్గించిన ఆర్టీసీ
ఆర్టీసీ కార్గో, పార్సిల్ సేవలను మరింత విస్తరించేందుకు జంటనగరాల్లో హోం డెలివరీ చార్జీలను తగ్గించినట్టు అధికారులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌తోపా టు నల్లగొండ, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ పట్టణాల్లో ఆర్టీసీ కార్గో హోం డెలివరీ సేవలను అందిస్తోంది. గ్రేటర్ పరిధిలో మరింత మంది వినియోగదారులకు సేవలను అందుబాటులో తెచ్చేందుకు 40 శాతం నుంచి 50 శాతం వరకు కార్గో చార్జీలను తగ్గించినట్టు వివరించారు.
30న 65 కేంద్రాల్లో రక్తదాన శిబిరం : వీసీ సజ్జనార్
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ-ప్రహరీ ట్రస్ట్‌ల సహకారంతో టీఎస్ఆర్టీసీ ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా 65 కేంద్రాల్లో రక్తదాన శిబిరాలను నిర్వహించనున్నట్టు ఆ సంస్థ మేనేజింగ్ డైరె క్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీలో సిబ్బంది నుంచి అధికారుల వరకు, స్నేహితుల నుంచి కుటుంబసభ్యుల వరకు అందరూ స్వచ్ఛందంగా రక్తదాన శిబిరంలో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరినీ చైతన్యపరిచి అత్యధిక సంఖ్యలో రక్తదానం చేసేలా అవగాహన కార్యక్రమాలను చేపట్టాల్సినఅవసరం ఉందని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు.