నాలుగు ఇళ్లు, గడ్డివాముల దగ్ధం

ABN , First Publish Date - 2021-02-05T07:05:18+05:30 IST

నాలుగు ఇళ్లు, గడ్డివాముల దగ్ధం

నాలుగు ఇళ్లు, గడ్డివాముల దగ్ధం

వెంకటాపూర్‌(రామప్ప), ఫిబ్రవరి 4 : అగ్నిప్రమాదంలో రెండు గ్రామాలకు చెందిన నాలుగు ఇళ్లు, ఐదెకరాల గడ్డివాములు దగ్ధమ య్యాయి. మండలంలోనిలక్ష్మీదేవిపేటకు చెందిన కుమ్మరి లచ్చులు, శంకర్‌ ఇళ్ల సమీపంలో ఐదెకరాల గడ్డిని నిల్వ చేశారు. గురువారం ఉదయం వారు పొలం పనులకు వెళ్లగా 10 గంటల సమయంలో గడ్డివాములకు మంటలు అంటుకుని, పక్కనే ఉన్న శంకర్‌ ఇంటికి వ్యాపించాయి. స్థానికులు ములుగు ఫైర్‌ సిబ్బంది సహకారంతో మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో శంకర్‌కు రూ.50వేల నష్టం వాటిల్లింది. పాలంపేటలో నిప్పంటుకుని ఇండ్ల సమ్మక్క, బాబూరావు, బండి సారయ్యల ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో మొత్తం రూ2లక్షల వరకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వ స్పందించి తమను ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు.

Updated Date - 2021-02-05T07:05:18+05:30 IST