పరిటాల సిద్ధార్థ బ్యాగులో తూటా?

ABN , First Publish Date - 2021-08-20T09:09:34+05:30 IST

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుల్లెట్‌ కలకలం రేపింది. టీడీపీకి చెందిన మాజీ మంత్రులు పరిటాల రవీంద్ర, పరిటాల సునీత చిన్న కుమారుడు పరిటాల సిద్ధార్థ

పరిటాల సిద్ధార్థ బ్యాగులో తూటా?

శంషాబాద్‌ విమానాశ్రయంలో కలకలం

పరిటాల రవి తనయుడిపై కేసు నమోదు


శంషాబాద్‌ రూరల్‌, ఆగస్టు 19: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుల్లెట్‌ కలకలం రేపింది. టీడీపీకి చెందిన మాజీ మంత్రులు పరిటాల రవీంద్ర, పరిటాల సునీత చిన్న కుమారుడు పరిటాల సిద్ధార్థ బ్యాగులో 5 ఎంఎం బుల్లెట్‌ ఉన్నట్టు విమానాశ్రయ భద్రత సిబ్బంది గుర్తించినట్టు విశ్వసనీయ సమాచారం. గురువారం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి శ్రీనగర్‌కు సిద్ధార్థ వెళ్తుండగా సీఐఎ్‌సఎఫ్‌ అధికారులు తనిఖీ చేసినపుడు బ్యాగులో బుల్లెట్‌ ఉన్నట్టు కనుగొన్నారని  తెలుస్తోంది. కాగా బ్యాగులో బుల్లెట్‌ ఉందని, దానికి అవసరమైన పత్రాలు లేవని తనకు తెలియదని సిద్ధార్థ చెప్పినట్టు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు స్పందించలేదు. ఆయనపై ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి, వివరణ ఇవ్వాలని నోటీసు ఇచ్చినట్టు తెలుస్తోంది. 

Updated Date - 2021-08-20T09:09:34+05:30 IST