బిటిపిఎస్ రైల్వే ట్రాక్ పరిహారంపై నిర్వాసితుల్లో అసంతృప్తి
ABN , First Publish Date - 2021-05-24T17:18:22+05:30 IST
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మణంలో బాగాంగా నిర్మించనున్న రైల్వేట్రాక్ ఏర్పాటులో భూములు కోల్పోతున్న నిర్వాసితుల్లో పరిహరంపై అసంతృప్తి నెలకొంది.

- మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని నిర్వాసితుల డిమాండ్
భద్రాద్రి కొత్తగూడెంః భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ రైల్వేట్రాక్, సీతమ్మసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితుల్లో పరిహరంపై అసంతృప్తి నెలకొంది. ఇప్పటికే శ్రీ కాళీమాత ఆలయ పరిహరం, ఆలయానికి భూమి కేటాయింపుల్లో తనకు అన్యాయం జరిగందంటూ స్థానికి ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి ఆలయపూజరి తీసుకుపోయి తనకు న్యాయం చేయాలని కోరారు. పరిహారంలో అసమానతలు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజిలో అన్యాయం జరిగిందని నిర్వాసితులు వాపోతున్నారు. ఇది ఇలా ఉండగా వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలక్టెర్ సీతమ్మసార్ ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఎకరాకు రూ.8 లక్షలు మాత్రమే పరిహారమిస్తామని చెబుతున్నారని తిర్లాపురం పంచాయతీ సర్పంచ్ కామరాజు పేర్కొన్నారు. పరిహరంలో అసమానతలు చోటుచేసుకున్నా, అర్హులకు అన్యాయం జరిగిన ఊరుకునేదిలేదని తేల్చి చెబుతున్నారు. మెరుగైన ప్యాకేజి ఇచ్చేవరకు నిర్వాసితుల తరుపున ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.