ఐసిఎంఆర్ కీలక ప్రాజెక్ట్ సలహాదారుగా బిపి ఆచార్య
ABN , First Publish Date - 2021-04-11T20:40:54+05:30 IST
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తన కీలక జాతీయ ప్రాజెక్ట్ నేషనల్ యానిమల్ రీసోర్స్ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్(ఎన్ఏఆర్ఎఫ్ బిఆర్)కు సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బిపి ఆచార్య నియమితులయ్యారు.
హైదరాబాద్: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తన కీలక జాతీయ ప్రాజెక్ట్ నేషనల్ యానిమల్ రీసోర్స్ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్(ఎన్ఏఆర్ఎఫ్ బిఆర్)కు సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బిపి ఆచార్య నియమితులయ్యారు. శామీర్‌పేట సమీపంలోని జీనోమ్ వ్యాలీలో 100 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్‌ను ఏర్పాటుచేస్తున్నారు. జినోమ్ వ్యాలీలో వరల్డ్‌క్లాస్ లైఫ్‌సైన్స్ క్లస్టర్‌గా తీర్చిదిద్దుతున్నారు. దాదాపు 300 కోట్లపెట్టుబడితో ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. ఫార్మా, బయోఫార్మా, వ్యాక్సిన్ పరిశ్రమలకు దేశంలోనే ప్రీ క్లినికల్ ట్రయల్స్‌ను సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది.