సెప్టిక్ ట్యాంక్‌లో పడి బాలుడు మృతి

ABN , First Publish Date - 2021-10-20T17:37:04+05:30 IST

చందానగర్ పాపిరెడ్డి కాలనీలో విషాదం చోటు చేసుకుంది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలోని సెప్టిక్ ట్యాంక్‌లో పడి బాలుడు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సెప్టిక్ ట్యాంక్‌లో పడి బాలుడు మృతి

హైదరాబాద్: చందానగర్ పాపిరెడ్డి కాలనీలో విషాదం చోటు చేసుకుంది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలోని సెప్టిక్ ట్యాంక్‌లో పడి బాలుడు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిన్న గాలి పటం ఎగురవేస్తూ పక్కనే ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో పడి అరవింద్(7) మృతి చెందాడు. నిన్నటి నుంచి బాలుడు కనిపించడం లేదంటూ చందనగర్ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. నిన్నటి నుంచి తల్లిదండ్రులు, పోలీసులు ఎంత వెదికినా బాలుడి ఆచూకీ లభించలేదు. ఈరోజు ఉదయం సెప్టిక్ ట్యాంక్‌లో ఉన్న బాలుడిని స్థానికులు గమనించారు. 


పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. చందానగర్ పోలీసులు 


కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-20T17:37:04+05:30 IST