జోరందుకున్న రిజిస్ట్రేషన్లు

ABN , First Publish Date - 2021-10-07T07:31:15+05:30 IST

రాష్ట్రంలో రియల్‌ సందడి పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా స్థిర, చర ఆస్తుల

జోరందుకున్న రిజిస్ట్రేషన్లు

హైదరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రియల్‌ సందడి పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా స్థిర, చర ఆస్తుల క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. కరోనా తీవ్రత, లాక్‌డౌన్‌ల కారణంగా 2021 మార్చి వరకు రిజిస్ట్రేషన్లు మందగించాయి. 2021 ఏప్రిల్‌ నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు క్రమంగా పుంజుకున్నాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే 2021 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి సెప్టెంబరు 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరుగగా, వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.4800 కోట్ల ఆదాయం సమకూరిందని రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు పేర్కొన్నారు.  


Updated Date - 2021-10-07T07:31:15+05:30 IST