ప్రజల్లో జాతీయ స్వాభిమానం పెంపొందాలి

ABN , First Publish Date - 2021-10-07T06:08:10+05:30 IST

ప్రజల్లో జాతీయ స్వాభిమానం పెంపొందాలి

ప్రజల్లో జాతీయ స్వాభిమానం పెంపొందాలి
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న మురళీధర్‌రావు, రఘునందన్‌రావు, శివస్వామిజీ

ఇస్లామిక్‌ టెర్రరిజాన్ని అంతమొందించాలి

బీజేపీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు

వడ్డెపల్లి, అక్టోబరు 6 : దేశ సమగ్రత, సమైక్యత కోసం ప్రజల్లో స్వా భిమానం పెంపొందాలని బీజేపీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, పార్టీ మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జి పొలుసాని మురళీధర్‌రావు అన్నారు. బుధవారం హనుమకొండ గోకుల్‌నగర్‌లోని అంబేద్కర్‌ భవన్‌లో భారత్‌నీతి, డిజిటల్‌ హిందూసమ్మేళనం కార్యక్రమాన్ని మురళీధర్‌రావు, దుబ్బా క ఎమ్మెల్యే రఘునందన్‌రావు, విజయవాడకు చెందిన శివక్షేత్రం స్థాపకులు శివస్వామి, బీజేపీ హనుమకొండ, వరంగల్‌ జిల్లాల అధ్యక్షుడు రావు పద్మ, కొండేటి శ్రీధర్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పొలుసాని మురళీధర్‌రావు మాట్లాడుతూ దేశంలో ఇస్లాం తీవ్రవాదం పెరిగితే మన గుడులు కూల్చివేయడంతోపాటు లైబ్రరీలను కూల్చివేస్తారని అన్నారు. ఇస్లామిక్‌ తీవ్రవాదాన్ని అంతమొందించాలని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, వారసత్వానికి చిహ్నం కేవ లం కాకతీయ కళాతోరణమే అని చెప్పారు. రాజకీయ తెలంగాణ ఏర్పడింది కానీ సంస్కృతి పరమైన తెలంగాణ ఆవిర్భావం కాలేదని అన్నా రు. నైజాం రజాకార్లు చేసిన దారుణాలు, హత్యలు, అత్యాచారాలు తెలంగాణ పల్లెల్లో కథలుగా, కథానికలుగా ఇప్పటికీ నిత్యం వినిపిస్తున్నాయని చెప్పారు. 

ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాట్లాడుతూ.. కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులు, వారి పరిపాలనాధక్షత ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ వల్లనే రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిందని చెప్పారు. శివస్వామిజీ మాట్లాడుతూ.. ధర్మం లేనిదే దేశం లేదన్నారు. ధర్మాన్ని రక్షించుకోవడానికి ప్రతీ ఇల్లు ప్రతినబూనాలని కోరారు. సదస్సులో వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ అండ్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ సలహాదారు ఉషానిర్మల, జర్నలిస్టు స్వప్న సుందరి, బీజేవైఎం జాతీ య కార్యదర్శి తజింధర్‌పాల్‌సింగ్‌ బగ్గా, స్ట్రింగ్‌ వ్యవస్థాపకులు వినోద్‌కుమార్‌, కార్పొరేటర్లు రావుల కోమల, చాడ స్వాతి, జలగం అనిత, గుజ్జుల వసంత, లావుడ్య రవినాయక్‌, చింతాకుల అనిల్‌, పొనుగోటి వెంకట్రావ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-07T06:08:10+05:30 IST