రేపు యథావిధిగా బీజేపీ నిరుద్యోగ దీక్ష

ABN , First Publish Date - 2021-12-26T23:40:57+05:30 IST

సోమవారం యథావిధిగా బీజేపీ నిరుద్యోగ దీక్ష నిర్వహిస్తామని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ఇందిరా పార్కు నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి దీక్ష వేదిక మార్చారు.

రేపు యథావిధిగా బీజేపీ నిరుద్యోగ దీక్ష

హైదరాబాద్‌: సోమవారం యథావిధిగా బీజేపీ నిరుద్యోగ దీక్ష నిర్వహిస్తామని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ఇందిరా పార్కు నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి దీక్ష వేదిక మార్చారు. పార్టీ కార్యాలయంలో బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేయనున్నారు. బీజేపీ దీక్షకు భయపడే ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందని బీజేపీ నేతలు మండిపడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ నిరుద్యోగ దీక్ష చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ దీక్ష కోసం బీజేపీ అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కాగా రాష్ట్రంలో ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు చేపట్టవద్దని హైకోర్టు జీవో జారీ చేసింది. ఈ మేరకు జనవరి 2వ తేదీ వరకు రాష్ట్రంలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధమని హైకోర్టు ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. కాగా హైకోర్టు ఆదేశాల ప్రకారం బీజేపీ దీక్షపై పోలీసులు ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అయితే పోలీసుల అనుమతి కోసం బీజేపీ దరఖాస్తు చేసుకుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బహిరంగ సభలు నిషేధం. ఈ మేరకు బీజేపీ దీక్షకి అనుమతి ఇవ్వలేమని పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-12-26T23:40:57+05:30 IST