బీజేపీ, టీఆర్‌ఎస్‌ తోడు దొంగలు

ABN , First Publish Date - 2021-11-26T09:56:00+05:30 IST

ధాన్యం కొనుగోలులో బీజేపీ, టీఆర్‌ఎస్‌లు దోబూచులాడుతున్నాయని బహుజన సమా జ్‌ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర కోఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ విమర్శించారు.

బీజేపీ, టీఆర్‌ఎస్‌ తోడు దొంగలు

ఆ పార్టీలకు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

జనగామ, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలులో బీజేపీ, టీఆర్‌ఎస్‌లు దోబూచులాడుతున్నాయని బహుజన సమా జ్‌ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర కోఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ విమర్శించారు. ఆ రెండు పార్టీలు తోడు దొంగల్లా తయారయ్యాయని, వాటికి రైతుల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. జనగామలో గురువారం బీఎస్పీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడుతూ 25 రోజులుగా కల్లాల్లో ధాన్యాన్ని పోసుకొని రైతులు ఎదురుచూస్తున్నారని, అయినప్పటికీ కొనుగోలు చేయకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం మిల్లర్లతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుందని, అందువల్లే ధాన్యం కొనుగోళ్లపై కుంటిసాకులు చెబుతోందని ఆరోపించారు. మిల్లర్లు రైతులను దోచుకుంటున్నా సర్కారు పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రం యాసంగి ధాన్యాన్ని కొన్నా.. కొనకున్నా తెలంగాణ ప్రభుత్వం కొని తీరాల్సిందేనని ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-11-26T09:56:00+05:30 IST