కాళేశ్వరంతో ప్రజల్ని వంచించారు
ABN , First Publish Date - 2021-01-20T08:10:26+05:30 IST
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కోటి ఎకరాలకు నీరు అంటూ రాష్ట్ర ప్రజలను సీఎం కేసీఆర్ వంచించారని బీజేపీ రాష్ట్ర

పూజలు చేస్తే పాపాలు పోవు.. సీఎంపై సంజయ్ ధ్వజం
హైదరాబాద్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కోటి ఎకరాలకు నీరు అంటూ రాష్ట్ర ప్రజలను సీఎం కేసీఆర్ వంచించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. దీనిపై లక్ష కోట్లు ఖర్చుపెట్టారని, మూడో టీఎంసీ పేరిట కొత్త డ్రామా ఆడుతున్నారని ఒక ప్రకటనలో ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసేందుకే కేసీఆర్ ప్రాజెక్టు వద్దకు వెళ్లారని, కాళేశ్వరంలో పూజలు చేసినంత మాత్రాన చేసిన పాపాలు పోవని ధ్వజమెత్తారు.