కమీషన్ల కోసమే కేంద్రంపై విమర్శలు
ABN , First Publish Date - 2021-10-30T05:03:35+05:30 IST
కమీషన్ల కోసమే కేంద్రంపై విమర్శలు

ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలి
పుడింగి మాటలు మాట్లాడుతున్న మంత్రి దయాకర్‌రావు
బీజేపీ నేతలు వివేక్, ప్రేమేందర్‌రెడ్డి
వరంగల్ సిటీ, అక్టోబరు 29: ధాన్యం కొనుగోలుపై ముఖ్యమంత్రి, మంత్రులు తలోమాట మాట్లాడుతుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొందని, ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. వరంగల్ రైల్వేస్టేషన్ రోడ్‌లోని ఓ హోటల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రభు త్వ వైఖరిని స్పష్టం చేయకుండా కేంద్రాన్ని నిందించడం సరికాదన్నారు. కేంద్రం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయమని ఎక్కడా చెప్పలేదన్నారు. రైతు సమస్యలపై మాట్లాడటానికి వస్తే పోలీసులు అడ్డుకోవడాన్ని తప్పుబట్టారు.
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా గురువారం హ నుమకొండలో మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెడితే కనబడని పోలీసులు.. బీ జేపీ ప్రెస్‌మీట్‌కి ఆక్షేపణ చెప్పడమేంటని ప్రశ్నించా రు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు టీఆర్‌ఎస్ కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని. ఓటుకు రూ. 6వేల చొప్పున రూ. 120 కోట్లను పంచుతోందని ఆరోపించారు.
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో మంత్రులు మతిలేని మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. వ్యవసాయశాఖ మంత్రికి కనీస అవగాహన లేదని, మంత్రి దయాకర్‌రావు ఏం మాట్లాడుతాడో తనకే తెలియదని ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోలు చేసేది కేంద్ర ప్రభుత్వమేనని, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన దళారి పనిని సైతం సక్రమంగా నిర్వర్తించడం లేదని విమర్శించారు. రైతులు పండించే ప్రతీ వరి గింజను కేంద్రం కొనుగోలు చేసి రైతులకు అండగా నిలుస్తుందన్నారు. రైతుల సమస్యపై అవగాహన లేని మంత్రి దయాకర్‌రావు పుడింగి మాటలు మాట్లాడుతున్నాడన్నారు.
టీఆర్‌ఎస్ సర్కారు అంబులెన్సుల్లో హుజూరాబాద్‌కు డబ్బులు సరఫరా చేస్తోందని ఆరోపించారు. చి న్నపాటి ఎన్నికలంటూ రికార్డు స్థాయిలో పథకాల పేరిట రూ. 4 వేల కోట్లు, పంపిణీకి మరో వెయ్యి కోట్లు ఖర్చు చేసిందని ధ్వజమెత్తారు. హుజూరాబాద్ ప్రజలు మాత్రం ఈటల పక్షానే ఉన్నారన్నారు. పోలీసులకు మంత్రి దయాకర్‌రావు నుంచి ఫోన్ రావడంతో బీజేపీ ప్రెస్‌మీట్‌ను అడ్డుకునేందుకు సర్వశక్తులొడ్డారన్నారు. ఆర్థిక మంత్రి హరీ్‌షరావు అబద్ధాల మంత్రి అని మండిపడ్డారు.
మంత్రులు బుద్ధి, జ్ఞానం, సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారుజ ఒక్క రోజులో ఓట్ల కోసం రూ. 200కోట్ల పంపిణీ చేసిన ఘనత టీఆర్‌ఎ్‌సకే దక్కుతుందన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి ఏనుగు రాకే్‌షరెడ్డి మాట్లాడుతూ... పోలీసుల పహారాలోనే హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్ డబ్బు లు పంపిణీ చేస్తున్నట్లు ఆరోపించారు. వాక్ స్వాతంత్ర్యాన్ని హరించే హక్కు పోలీసులకెక్కడిదని ప్రశ్నించారు.