2023లో తెలంగాణలో హిందూ రాజ్యం రాబోతోంది: బండి సంజయ్

ABN , First Publish Date - 2021-02-20T01:05:53+05:30 IST

ఏపీలో క్రైస్తవ రాజ్యం.. తెలంగాణలో ముస్లిం రాజ్యం నడుస్తోందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బోరబండలో

2023లో తెలంగాణలో హిందూ రాజ్యం రాబోతోంది: బండి సంజయ్

హైదరాబాద్: ఏపీలో క్రైస్తవ రాజ్యం.. తెలంగాణలో ముస్లిం రాజ్యం నడుస్తోందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బోరబండలో శివాజీ విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదం నెలకొంది. దీంతో ఆ ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘2023లో తెలంగాణలో హిందూ రాజ్యం రాబోతోంది. భవిష్యత్‌లో కాషాయ జెండా మాత్రమే తెలంగాణలో ఎగరబోతోంది. ఒక వర్గం ఓట్ల కోసమే ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు జరపటం లేదు. మా ప్రభుత్వం వచ్చాక గ్రామ గ్రామాన శివాజీ విగ్రహాలు ఏర్పాటు చేస్తాం. బోరబండలో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయటం మాకు పెద్ద సమస్య కాదు. శివాజీ జయంతి ఉత్సవాలను అడ్డుకోవటం సిగ్గుచేటు. గ్రేటర్‌లో హిందువులు చెంప దెబ్బ కొట్టినా పాలకులకు సిగ్గురాలేదు. హిందువుల దేవుళ్ళను అవమానించిన ఎంఐఎంకు ప్రభుత్వం కొమ్ము కాస్తోంది. మత మార్పిడులపై ధర్మయుద్ధం చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. 80 శాతమున్న హిందువుల ఓటు బ్యాంక్‌గా మారబోతున్నారు’ అని తెలిపారు.

Updated Date - 2021-02-20T01:05:53+05:30 IST